రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. వికారాబాద్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఏడు, మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలోని ఏడు గ్రామాలతో కొత్తగా చౌడాపూర్ మండలాన్ని ప్రతిపాదించారు. చౌడాపూర్, మండిపాల్, వీరాపూర్, విఠలాపూర్, మక్త వెంకటాపూర్, అడవి వెంకటాపూర్, లింగంపల్లి, కొత్తపల్లి, పురుసంపల్లి, మల్కాపూర్, మరికల్, కన్మన్ కాల్వ, మొగిల్లపల్లి, చాకల్ పల్లి గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు కానుంది.
రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు - telangana news
రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు ఆవిర్భవించనున్నాయి. వికారాబాద్ జిల్లాలో చౌడాపూర్, మహబూబ్నగర్ జిల్లాలో మహమ్మదా మండలాల ఏర్పాటు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.
మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా మహమ్మదాబాద్ మండలం ఏర్పాటు కానుంది. గండీడ్ మండలంలోని పది గ్రామాలతో కొత్త మండలాన్ని ప్రతిపాదించారు. మహమ్మదాబాద్, సంగాయిపల్లి, అన్నరెడ్డిపల్లి, ముకర్లబాద్, లింగాయిపల్లి, మంగంపేట, చౌదర్ పల్లి, గండిర్యాల, నన్చెర్ల, జూలపల్లి గ్రామాలతో కొత్త మండలాన్ని ప్రతిపాదించారు. మండలాల ఏర్పాటు ప్రతిపాదనలపై నెల రోజుల పాటు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి: ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన పీఆర్‌సీ కమిటీ