వచ్చేనెల 10వ తేదీలోపు బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు ఏర్పడేందుకు అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. రానున్న రెండ్రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఓ అల్పపీడనం ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది 30వ తేదీలోపు వాయుగుండంగా మారి, ఆ తర్వాత మరింత బలపడే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఇది పశ్చిమ దిశలోని తమిళనాడు, పుదుచ్చేరి తీరాన్ని ఈనెల 2న తాకే అవకాశముందని తెలిపారు. తీరం దాటాక బలహీనపడి అరేబియా సముద్రంవైపు వెళ్తుందని, అక్కడ మళ్లీ బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని చెబుతున్నారు.
రెండు వారాల్లో 2 వాయుగుండాలు..!
బంగాళాఖాతంలో త్వరలో రెండు వాయుగుండాలు ఏర్పడేందుకు అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. నివర్ తుపాను క్రమంగా బలహీనపడి శుక్రవారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని.. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
అయితే.. అక్కడ బలపడే అవకాశాలు (1-33)శాతం మాత్రమే ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు డిసెంబరు 4-10తేదీల మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడేందుకు 34-67శాతం అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. దక్షిణకోస్తా మీదుగా.. నివర్ తుపాను క్రమంగా బలహీనపడి శుక్రవారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని.. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆ సమయానికి దక్షిణకోస్తా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కేంద్రీకృతమై ఉందని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి దాకా మత్స్యకారులకు హెచ్చరికల్ని కొనసాగించినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: నివర్ ధాటికి అతలాకుతలం...స్తంభించిన జనజీవనం