తెలంగాణ

telangana

ETV Bharat / city

కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు లేఖలు

Two more letters from telangana government to the Krishna river management board
Two more letters from telangana government to the Krishna river management board

By

Published : Aug 12, 2022, 5:37 PM IST

Updated : Aug 12, 2022, 6:37 PM IST

17:35 August 12

గాలేరు-నగరి నుంచి హంద్రీనీవాకు నీరు తరలింపుపై అభ్యంతరం

Telangana Letters to KRMB: గాలేరు నగరి నుంచి హంద్రీ నీవాకు నీటిని తరలించేందుకు ఎత్తిపోతలు చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పనులు చేయడం తగదని పేర్కొంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. రెండు ప్రాజెక్టులకు అనుమతుల్లేవని.. వాటి విస్తరణ పనులకు అనుమతి తగదని లేఖలో పేర్కొన్నారు. ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తగదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేసిన్ వెలుపలకు కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశామని తెలంగాణ పేర్కొంది. అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను నిలువరించాలని కృష్ణా బోర్డును కోరింది. పర్యావరణ అనుమతులు కూడా నిలుపుదల చేయాలని కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాయాలని కేఆర్ఎంబీని తెలంగాణ కోరింది.

రూల్ కర్వ్స్ ఖరారు కోసం తాము కోరిన సమాచారం ఇవ్వాలని కృష్ణా బోర్డును తెలంగాణ మరోసారి కోరింది. తమ విజ్ఞప్తిని కృష్ణా బోర్డు తప్పుగా అర్థం చేసుకుందంటూ ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు. రూల్ కర్వ్స్ ఖరారు కోసం ఎస్సార్బీసీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తదితరాల అనుమతుల వివరాలు తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనధికారికంగా పెద్దమొత్తంలో కృష్ణా నీటిని బేసిన్ వెలుపలకు తరలిస్తోందని.. ఏపీ అక్రమ జల తరలింపును ఎత్తి చూపేందుకు ఇది సరైన సమయమని పేర్కొంది. రూల్ కర్వ్స్ ఖరారుకు ముందు కొన్ని ఒప్పందాలు అవసరమని తెలంగాణ తెలిపింది. తదుపరి ఆర్ఎంసీ సమావేశం నాటికి తాము అడిగిన సమాచారం, వివరాలు ఇవ్వాలని కృష్మఆ బోర్డును తెలంగాణ కోరింది.

ఇవీ చూడండి:

Last Updated : Aug 12, 2022, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details