తెలంగాణ

telangana

ETV Bharat / city

వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు.. ఎందుకంటే

వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. సాగునీరు, విద్యుత్, ఎరువులు, విత్తనాల పర్యవేక్షణకు ఒక విభాగం, మార్కెటింగ్‌పై దృష్టిసారించేందుకు మరో విభాగం పనిచేయాలని సూచించారు.

kcr on agriculture
వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు.. ఎందుకంటే

By

Published : Oct 23, 2020, 9:47 PM IST

తెలంగాణ అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా మారుతోందని సీఎం అన్నారు. ఈ తరుణంలో వ్యవసాయశాఖ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐఏఎస్ అధికారులను బాధ్యులుగా నియమించాలన్నారు. సాగునీరు, విద్యుత్, ఎరువులు, విత్తనాల పర్యవేక్షణకు ఒక విభాగం, మార్కెటింగ్‌పై దృష్టి సారించేందుకు మరో విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు.

కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల వల్ల 24 జిల్లాలు సుభిక్షంగా మారాయని సీఎం పేర్కొన్నారు. కృష్ణా నదిపై కట్టే ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు సుభిక్షంగా మారబోతున్నాయన్నారు.

పంట కాలాల్లో తేడాల మేరకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచాలని సీఎం కేసీఆర్​కు సూచించారు. పంటల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో 20 నుంచి 25 లక్షల ఎకరాల్లో కందులు, 12 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగవ్వాలని సీఎం అన్నారు.

ఇవీచూడండి:ఈనెల 29న ధరణి పోర్టల్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details