సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్లో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి, మైనార్టీ సంక్షేమ శాఖలో పొరుగు సేవల సిబ్బంది ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.
బీఆర్కే భవన్లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ - corona cases in telangana
సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్లో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వారు పనిచేసే మూడు, ఐదో అంతస్థులను అధికారులు శానిటేషన్ చేయించారు.

బీఆర్కే భవన్లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
ఇద్దరిలో ఒకరికి ఎలాంటి లక్షణాలు లేకపోగా.. మరో ఉద్యోగి నాలుగైదు రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. అప్రమత్తమైన అధికారులు వారు పనిచేసే మూడు, ఐదో అంతస్థులను శానిటేషన్ చేయించారు. ఇప్పటికే బీఆర్కే భవన్లో ఆరుగురు ఉద్యోగులు కరోనా బారిన పడగా తాజా నిర్ధరణతో కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
ఇవీచూడండి:కరోనా ఉన్నా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే