తెలంగాణ

telangana

ETV Bharat / city

సికింద్రాబాద్​లో ట్రాఫిక్ పోలీసుల మౌన ప్రదర్శన - Martyrs' Remembrance Day on January 30th

అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్​లోని ప్యాట్నీ-ప్యారడైజ్-సంగీత్ కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలు నిలిపివేశారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

two minutes silence in secundrabad on the occasion of Martyrs' Remembrance Day 2021
సికింద్రాబాద్​లో ట్రాఫిక్ పోలీసుల మౌన ప్రదర్శన

By

Published : Jan 30, 2021, 1:27 PM IST

అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. శనివారం ఉదయం 11 గంటలకు రెండు నిమిషాలు దేశవ్యాప్తంగా మౌనం పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడి వారు అక్కడే.. పనులు, కదలికలు ఆపేయాలని అన్ని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది.

కేంద్రం ఆదేశాల మేరకు సికింద్రాబాద్​లోని ప్యాటీ-ప్యారడైజ్-సంగీత్ కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలు నిలిపివేశారు. రెండు నిమిషాలు వాహనదారులతో పాటు మౌనం పాటించారు. వాహనదారులంతా ఎక్కడివారక్కడే ఆగి.. అమర వీరులకు నివాళులర్పించారు.

కూడలి నలువైపులా రెడ్ సిగ్నల్ వేసి.. ప్రతి ఒక్కరు ఇందులో భాగమయ్యేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో ప్యాట్నీ సెంటర్ వద్ద ఆంబులెన్స్ రావడం వల్ల మానవతా దృక్పథంతో.. పోలీసులు ఆంబులెన్స్​ను పంపించారు.

ABOUT THE AUTHOR

...view details