తెలంగాణ

telangana

ETV Bharat / city

వాస్తు లోపం రీత్యా ఏపీ సచివాలయ ప్రధాన గేట్ల తొలగింపు - two gates removed in ap secratariate news

ఏపీ వెలగపూడి సచివాలయంలో రెండు ప్రధాన గేట్లను తొలగించి.. వాటి స్థానంలో ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారు. వాస్తు ప్రకారం గేట్ల నిర్మాణం సరిగా లేదని వీటిని తొలగించినట్లు సమాచారం. భద్రతా కారణాల రీత్యా గోడ నిర్మాణం చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.

వాస్తు లోపం రీత్యా ఏపీ సచివాలయ ప్రధాన గేట్లు తొలగింపు
వాస్తు లోపం రీత్యా ఏపీ సచివాలయ ప్రధాన గేట్లు తొలగింపు

By

Published : Jul 27, 2020, 7:22 PM IST

ఏపీ వెలగపూడి సచివాలయంలోని ప్రహరీకి ఉన్న రెండు ప్రధాన గేట్లను తొలగించిన అధికారులు వాటిస్థానంలో గోడ నిర్మాణాన్ని చేపట్టారు. సచివాలయంలో నాలుగు - ఐదో బ్లాక్​లకు సమీపంలోని ఉత్తరం వైపు ఉన్న గేటుతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న ఒకటో బ్లాక్ వద్ద మరో గేటును తొలగించి ప్రహరీ నిర్మాణం చేపట్టారు.

వాస్తు ప్రకారం గేట్ల నిర్మాణం సరిగా లేదంటూ సూచనలు రావటంతో హుటాహుటిన గేట్లను తొలగించి గోడ నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా ఉత్తర, దక్షిణం వైపు ఉన్న గేట్లను మూసివేస్తున్నట్టు సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : 'అమ్మ ముందే చనిపోయింది.. తర్వాత నాన్న వెళ్లిపోయాడు'

ABOUT THE AUTHOR

...view details