Two Lorries Stuck On The Road: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి-కొత్తవలస ప్రధాన రోడ్డులో ఆనందపురం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీల చక్రాలు రోడ్డులో దిగిపోయాయి. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కొత్తవలస-దేవరాపల్లి ప్రధాన రోడ్డులో.. దేవరాపల్లి నుంచి ఆనందపురం వరకు రోడ్డు పనులు రెండేళ్ల క్రితం ప్రారంభించారు. అయితే దేవరాపల్లి నుంచి ఆనందపురానికి మధ్యలో ఉన్న వావిలపాడు కూడలి వరకు మాత్రమే పనులు పూర్తి చేశారు.
అసంపూర్తిగా పనులు.. రోడ్డుపై ఎదురెదురుగా దిగబడిన లారీలు..! - Ap latest news
Two Lorries Stuck On The Road: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో దారి మధ్యలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీల చక్రాలు రోడ్డులోకి దిగబడిపోయాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లారీలను అక్కడి నుంచి తొలగించే వరకు.. ఆ దారిగుండా వెళ్లే వాహనాల ప్రయాణానికి వీలు లేకుండా పోయింది.
Two Lorries Stuck On The Road
మిగిలిన రోడ్డు పని చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. గుత్తేదారుడుకి బిల్లులు రాకపోవడంతో పనులు చేపట్టలేదు. దీంతో అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పెద్దగా గోతులు ఏర్పడి, వర్షానికి మరింత అధ్వానంగా తయారైంది. అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు వర్షానికి నానిపోవటంతో.. లారీల చక్రాలు రోడ్డు మధ్యలో దిగిపోయాయి. రెండు ఒకే దగ్గర ఎదురెదురుగా దిగిపోవటంతో.. వాహనాలు నిలిచిపోయాయి.
ఇవీ చదవండి: