హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి లక్ష రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పాలస్తీనాకు చెందిన సయిద్ అలీ పదేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్‌కు అలవాటు పడి.. దాన్నే విక్రయించడం మొదలు పెట్టాడు. గతేడాది జులైలో డ్రగ్స్ విక్రయిస్తూ అమీర్‌పేట్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి జైలు నుంచి బయటికి వచ్చాడు.
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయుల అరెస్ట్ - two foreigners arrested for drugs selling
హైదరాబాద్‌లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాలస్తీనాకు చెందిన సయిద్ అలీ, ఒమన్‌కు చెందిన అబ్దురబు నుంచి లక్ష రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
![డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయుల అరెస్ట్ two foreigners arrested for drugs selling](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5375719-877-5375719-1576342155302.jpg)
ఒమన్‌కు చెందిన అబ్దురబు ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మత్తు పదార్థాలకు బానిసై ఇంజినీరింగ్ పరీక్షల్లో తప్పాడు. పాతబస్తీకి చెందిన ఓ యువతిని మోసం చేసిన కేసులో కూడా ఇతనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో డబ్బుల కోసం మత్తు పదార్థాలు విక్రయించడం మొదలు పెట్టాడు. సయీద్, అబ్దురబు కలిసి గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. నిఘా పెట్టి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వీళ్లకు డ్రగ్స్ విక్రయించిన ఇద్దరూ పరారీలో ఉన్నారు.