తెలంగాణ

telangana

ETV Bharat / city

Liquor Bottles: అయ్యో.. రూ.2 కోట్ల విలువైన మద్యం సీసాలు నేలపాలు - రోడ్డు రోలర్​తో తొక్కించి మద్యం ధ్వంసం

Liquor Bottles: ఏపీలోని విజయవాడ కమిషనరేట్ పరిధిలో సుమారు రూ.2 కోట్ల విలువైన 62 వేల మద్యం సీసాలను పోలీసులు రోడ్డు రోలర్​తో తొక్కించి ధ్వంసం చేశారు. విదేశీ మద్యం సీసాలు కూడా ధ్వంసమైన వాటిలో ఉన్నాయని కమిషనర్ కాంతిరాణా తెలిపారు.

Liquor Destroyed
Liquor Destroyed

By

Published : Jul 26, 2022, 8:08 PM IST

Updated : Jul 26, 2022, 11:33 PM IST

Liquor Bottles: ఏపీలోని విజయవాడ కమిషనరేట్ పరిధిలో గత రెండేళ్లలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు నిర్వీర్యం చేశారు. సుమారు రూ.2 కోట్ల విలువ చేసే 62 వేల మద్యం సీసాలను నున్న మ్యాంగో మార్కెట్​ యార్డులో పోలీసులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వాటిలో విదేశీ మద్యం బాటిల్స్ కూడా ఉన్నాయని కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు.

అక్రమ మద్యం రవాణాను కట్టడి చేస్తామని కాంతిరాణా టాటా తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్​పోస్టుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోని మైలవరం, విస్సన్నపేట తదితర మండలాల్లో నాటుపుసారాపై ప్రత్యేక నిఘా పెడతామని వెల్లడించారు.

Liquor Bottles
Last Updated : Jul 26, 2022, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details