తెలంగాణ

telangana

ETV Bharat / city

నకిలీ ధ్రువపత్రాల కేసులో ఇద్దరు అరెస్టు - Hyderabad fake certificate

సికింద్రాబాద్​లో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమైన నిందితుడు.. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నకిలీ ధ్రువపత్రాల కేసులో ఇద్దరు అరెస్టు

By

Published : Nov 24, 2019, 6:58 PM IST

ఆర్మీ ఉద్యోగుల రుణాల కోసం అవసరమైన సర్వీసు ధ్రువపత్రాలను అందిస్తామని నమ్మించి నకిలీ పత్రాలను తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాజధాని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ రసూల్​ పురాకు చెందిన నరేశ్​ ఫ్రీ లాన్సర్ ఏజెంట్​గా పని చేస్తూ ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమైన నిందితుడు.. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు.

నకిలీ పత్రాలు ​
బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవసరమైన ధ్రువపత్రాలను అందిస్తామని ప్రకటనలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారికి రుణం ఇప్పించేందుకు డబ్బులు మాట్లాడుకుని అందుకు అవసరమైన నకిలీ పత్రాలను సృష్టించేవారు. దీనికి సంబంధించిన స్టాంపులను కూడా ఓ వ్యక్తి వద్ద తయారు చేయించినట్లు వెల్లడించారు. ఈముఠా కదలికలపై అనుమానం వచ్చిన కొంతమంది ఆర్మీ సిబ్బంది.. నిఘా పెట్టి టాస్క్ ఫోర్స్, కార్ఖానా పోలీసుల సాయంతో పట్టుకున్నారు. మరో నిందితుడు అనిల్ కుమార్ పరారీలో ఉన్నాడు.

నకిలీ ధ్రువపత్రాల కేసులో ఇద్దరు అరెస్టు

ఇదీ చూడండి: ఇంట్లోనే దొరికేశారు.. పక్కగదిలో ఇంకో ఇద్దరున్నారు!

ABOUT THE AUTHOR

...view details