తెలంగాణ

telangana

ETV Bharat / city

ట్విట్టర్​ ట్రెండింగ్​లో హ్యాపీ బర్త్​డే కేసీఆర్​

సీఎం కేసీఆర్ 66వ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకుని జాతీయ, రాష్ట్ర నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్ ట్రెండింగ్​లో హ్యాపీ బర్త్​డే కేసీఆర్ యాష్​ ట్యాగ్​ ఉంది.

cm kcr
cm kcr

By

Published : Feb 17, 2020, 12:40 PM IST

Updated : Feb 17, 2020, 1:02 PM IST

తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్​ 66వ జన్మదినోత్సవం సందర్భంగా.. రాష్ట్రమంతటా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రముఖులు, అధికారులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచి జాతీయ నేతలు, రాష్ట్ర ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు. హ్యాపీ బర్త్​డే కేసీఆర్ యాష్​ ట్యాగ్​ ట్విట్టర్ ట్రెండింగ్​లో ఉంది.

ట్విట్టర్​ ట్రెండింగ్​లో హ్యపీ బర్త్​డే కేసీఆర్​

సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపుతు ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌ సంపూర్ణ ఆయురారోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.

సీఎం కేసీఆర్​కు మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ధైర్యవంతుడు, దయ కలిగిన వ్యక్తి కేసీఆర్​ అని.. అతన్ని తాను తండ్రిగా పిలవడం గర్వకారణమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ తెలిపారు. కేసీఆర్ దీర్ఘకాలం జీవించాలని.. తన నిబద్ధతతో మరింత స్పూర్తి నింపాలని ఆకాంక్షించారు. 'తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ తారక రామారావు ట్వీట్ చేశారు.

తెలంగాణ.. కేసీఆర్​ స్వప్నమని, ప్రత్యేక రాష్ట్రం తన త్యాగఫలమని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి తన దక్షతకు నిదర్శనమని... తెలంగాణ గడ్డకు కేసీఆరే శ్రీరామ రక్ష అంటూ ఆర్థిక మంత్రి హరీశ్​ రావు ట్విటర్​ ద్వారా తెలిపారు. తెలంగాణ జాతిపిత, కల్వకుంట్ల చంద్రశేఖర్​రావు శతవసంతాలు జీవించాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్​కు మాజీ ఎంపీ కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్​డే నాన్న! నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశారు.

సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్​ జన్మదిన శుభాకాంక్షలు తెలిపుతూ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌ సంపూర్ణ ఆయురారోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.

కేసీఆర్​కు తెదేపా అధినేత చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పుడూ నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

సీఎం కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, తెరాస ఎంపీ సంతోష్​ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపుతూ ట్వీట్ చేశారు.

కేసీఆర్‌కు మేఘాలయ సీఎం సంగ్మా, నాగాలాండ్‌ సీఎం నెఫియూ రియో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి:కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీశ్, కవిత

Last Updated : Feb 17, 2020, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details