తెలంగాణ

telangana

ETV Bharat / city

వర్షం నీటిలో తేలియాడుతున్న జంటనగరాలు - హైదరాబాద్​లో వర్షం

వర్షపు నీటితో భాగ్యనగరం నిండిపోయింది. ఒక్కో రోడ్డు ఒక్కో కాలువలా ప్రవహిస్తోంది. పలు కాలనీల్లో ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.

twin cities floating in rain water
వర్షం నీటిలో తేలియాడుతున్న జంటనగరాలు

By

Published : Oct 13, 2020, 8:26 PM IST

Updated : Oct 13, 2020, 10:00 PM IST

వర్షం నీటిలో తేలియాడుతున్న జంటనగరాలు

రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో... జంటనగరాలు జలమయమయ్యాయి. నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. చాలా చోట్ల మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. కూడళ్ల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. కార్యాలయాల నుంచి ఇంటికి చేరే సమయం కావడం వల్ల... వాహనాలు ఎక్కువగా రోడ్లపైకి వచ్చాయి.

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కూడా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. చెట్టు కూలి రోడ్లపై పడ్డాయి. కొన్నిచోట్ల విద్యుత్ తీగలు తెగి సరఫరా నిలిచిపోయింది. చెరువులు పూర్తిగా నిండటం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి:వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంలో భారీ వర్షాలు

Last Updated : Oct 13, 2020, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details