తెలంగాణ

telangana

ETV Bharat / city

Jangareddygudem Issue: 'కల్తీసారా కాటే'.. తేల్చిచెప్పిన బాధిత కుటుంబ సభ్యులు - జంగారెడ్డి గూడెం సారాయి మరణాలు

jangareddygudem death case: కదిపితే కన్నబిడ్డ లేడంటూ తల్లులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంటి పెద్దగా పిల్లల బాగోగులు చూసుకునే భర్తలు దూరమయ్యారంటూ భార్యలు ఘోష పెడుతున్నారు. అయినవారు దూరమయ్యారంటూ బంధువులు కన్నీరు కారుస్తున్నారు. ఇది జంగారెడ్డిగూడెంలో నాటుసారా బాధిత కుటుంబాల వ్యథ! తమవారి అకాల మరణానికి కల్తీసారానే కారణమంటూ 27 కుటుంబాలకు చెందినవారు కేసు పెట్టారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలుగుదేశం నేతలు ప్రకటించారు.

jangareddygudem death case
జగ్గారెడ్డిగూడెంలో సారా మరణాల ఘటన

By

Published : Mar 22, 2022, 4:58 PM IST

jangareddygudem death case: ఇంటికి పెద్దదిక్కుగా ఉండాల్సిన తమవారి అకాల మరణానికి కారణం నాటుసారా రక్కసేనని జంగారెడ్డిగూడెం బాధిత కుటుంబసభ్యులు తేల్చిచెప్పారు. ఇది సహజ మరణం అని ప్రభుత్వం ఎంతగా వాదించి తమను బెదిరించి భయపెట్టినా మనోభావాలు చంపుకొని అబద్ధాన్ని నిజంగా ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోమని స్పష్టం చేశారు. తమతో కలెక్టరేట్‌ వద్ద తప్పుడు నివేదికపై సంతకం పెట్టించేందుకు ఎంతలా ప్రయత్నించినా ఆత్మాభిమానాన్ని చంపుకోలేదని వివరించారు.

జంగారెడ్డిగూడెం ఘటనకు కల్తీసారానే కారణం: బాధితులు

కల్తీ సారానే కారణం

జంగారెడ్డిగూడెం ఘటనకు కల్తీసారానే కారణమని బాధిత కుటుంబసభ్యులు పోలీసుల సమక్షంలో తేల్చిచెప్పారు. కొందరు నిజాల్ని సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సహజ మరణాలంటూ చీకటి కోణాల్ని వెలుగులోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సమావేశానికి వెళ్లనీయకుండా బెదిరించారని వెల్లడించారు.

బాధితులకు పరిహారం

కల్తీసారా ప్రభావం కాకపోతే ఒకేరకమైన లక్షణాలతో వరుస మరణాలు ఎలా చోటు చేసుకుంటాయని బాధిత కుటుంబసభ్యులు ప్రశ్నించారు. ఇకపై తమ కుటుంబాలు గడిచేదెలాగంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీసారా మృతుల కుటుంబాల పక్షాన ఎంతవరకైనా పోరాడతామని బాధితులకు తెలుగుదేశం నేతలు భరోసానిచ్చారు. సొంత బ్రాండ్లతో సీఎం జగన్ ఆదాయం పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం చొప్పున 27 కుటుంబాలకు పార్టీ తరఫున పరిహారం అందించారు.

ఇదీ చదవండి:కేసీఆర్‌ ప్రభుత్వ అక్రమాలకు కేంద్రం సహకరిస్తోంది: రేవంత్‌ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details