తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీకాళహస్తీశ్వరునికి 12 కేజీల వెండి నవగ్రహ కవచం వితరణ

తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరునికి 12కేజీల వెండి నవగ్రహ కవచాన్ని వితరణ చేశారు. ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో వేదపండితులతో ప్రత్యేక పూజలు చేసి వెండిని స్వీకరించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీకాళహస్తీశ్వరునికి 12 కేజీల వెండి నవగ్రహ కవచం వితరణ..
శ్రీకాళహస్తీశ్వరునికి 12 కేజీల వెండి నవగ్రహ కవచం వితరణ..

By

Published : Jan 7, 2021, 7:48 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లాలో గల శ్రీకాళహస్తీశ్వరునికి 12కేజీల వెండి నవగ్రహ కవచాన్ని తమిళనాడులోని చిన్నసేలంకు చెందిన రవీంద్రన్ కుటుంబ సభ్యులు వితరణగా అందచేశారు. ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో వేదపండితులతో ప్రత్యేక పూజలు చేసి వెండిని స్వీకరించారు. దాతల కుటుంబ సభ్యులకు దర్శన ఏర్పాట్లు నిర్వహించి ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details