ఏబీసీఎల్ ఖాతా నుంచి అక్రమంగా డబ్బులను తీసుకున్న కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత రెండు సంవత్సరాల్లో అసోసియేటెడ్ బ్రాడ్ కాస్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిడెట్(ఏబీసీఎల్) నుంచి నిబంధనలకు విరుద్ధంగా రూ.18కోట్లకు పైగా నగదును తీసుకున్నట్లు అలంద మీడియా.... రవిప్రకాశ్, కేవీఎన్ మూర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ల తీర్మానం అనంతరం డబ్బులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ... అవేమీ పట్టించుకోకుండా బోనస్ పేరుతో డబ్బులను తీసుకొని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన బంజారాహిల్స్ పోలీసులు... పలు ఆధారాలు సేకరించారు. రవిప్రకాశ్ ను ఉదయం నుంచి సాయంత్రం వరకు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు విచారించారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆయన నుంచి పలు వివరాలు రాబట్టారు. అనంతరం రవిప్రకాశ్‌పై 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ సుమతి తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.
ఈ నెల 18 వరకు రిమాండ్: