తెలంగాణ

telangana

ETV Bharat / city

TV classes in Telangana: నేటి నుంచే వారికి టీవీ పాఠాలు - online classes for students in telangana

TV classes in Telangana: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరోసారి ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ సమాయత్తమైంది. 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు నేటి నుంచి... టీశాట్‌ ద్వారా డిజిటల్‌ పాఠాలను విద్యాశాఖ ప్రసారం చేయనుంది.

TV classes in Telangana
నేటి నుంచే వారికి టీవీ పాఠాలు

By

Published : Jan 24, 2022, 7:26 AM IST

TV classes in Telangana: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం సోమవారం నుంచి టీశాట్‌(విద్యా ఛానెల్‌) ద్వారా డిజిటల్‌ పాఠాలను విద్యాశాఖ ప్రసారం చేయనుంది. ఈ నెల 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో టీవీ పాఠాలను ప్రసారం చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ(సైట్‌) ఆదివారం రాత్రి పాఠాల కాలపట్టికను విడుదల చేసింది.

సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠాలు ప్రసారం కానున్నాయి. ఆంగ్లం, తెలుగు, ఉర్దూ మాధ్యమంలో పాఠాలను ప్రసారం చేస్తున్నారు. ఒక్కో తరగతికి ఒక్కో మాధ్యమానికి రెండు తరగతులు ప్రసారమవుతాయి. ఒక్కో పాఠం 30 నిమిషాలపాటు ఉంటుంది. ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ఉండగా... ఈ నెల 24, 25, 27, 28 తేదీల్లో టీవీ పాఠాలు వస్తాయి. ఈ నెల 26న రిపబ్లిక్‌ దినోత్సం కాగా...ఈ నెల 29, 30 శని, ఆదివారాలు పాఠాలు ఉండవు.

ABOUT THE AUTHOR

...view details