మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిర్మలాపూర్‌లో గుర్రం నర్సింహులును ఇసుక మాఫియానే హత్యచేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతోందని, దానిని అడ్డుకునేందుకు యత్నించడం వల్లనే హత్య జరిగిందన్నారు.
గుర్రం నర్సింహులును ఇసుక మాఫియానే హత్యచేసింది: రమణ - గుర్రం నర్సింహులది హత్యే
మహబూబ్‌నగర్ తిర్మలాపూర్‌లో గుర్రం నర్సింహులును ఇసుక మాఫియానే హత్య చేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. నర్సింహులు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రమణ డిమాండ్ చేశారు.
గుర్రం నర్సింహులును ఇసుక మాఫియానే హత్యచేసింది: రమణ
మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతోనే ప్రమాదంగా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. నేరెళ్లలో ఇసుక మాఫియా పెట్రేగిపోయినట్లుగానే.. ఇక్కడ కూడా జరుగుతోందని మండిపడ్డారు. నర్సింహులు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రమణ డిమాండ్ చేశారు.
ఇవీచూడండి:ఇసుక మాఫియా వెనక ఎంత పెద్ద అండ ఉందో అర్థమవుతోంది: చాడ