తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది' - l ramana fires on kcr

సీఎం కేసీఆర్ నియంతృత్వ, నిర్లక్ష్య పాలన వల్ల రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్ .రమణ అన్నారు. తెరాస పాలనలోని వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

l ramana
l ramana

By

Published : Dec 9, 2019, 4:50 PM IST

కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏడాది కాలంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు అచేతనావస్థలోకి వెళ్లాయనితెతెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు.

కేసీఆర్‌ పాలనలోని వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. బుధ, గురువారాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో, శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద నిరసనలు తెలపనున్నట్లు రమణ వివరించారు.

కేసీఆర్ ఏడాది పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం అయింది: ఎల్​ రమణ

ఇదీ చూడండి: చటాన్​పల్లి ఎన్​కౌంటర్​పై సిట్​ కార్యాచరణ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details