హైదరాబాద్ నగరంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు
అన్నదాతను ఆదుకోకపోతే దశలవారీ ఉద్యమం: రమణ - ఎల్ రమణ తాజా వార్తలు
అకాల వర్షాలకు రాష్ట్రంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినందుకు చంద్రబాబుకు రమణ కృతజ్ఞతలు తెలిపారు. వర్షాలకు నష్టపోయిన వారిని ఆదుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్ రమణ రెండోసారి ఎన్నికైన సందర్భంగా పార్టీ నేతలు ఆయన్ను ఘనంగా సన్మానించారు. మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. తడిసిన ధాన్యం, పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని.. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులకు రూ. 25వేల నష్టపరిహారం అందించాలన్నారు.
ఇవీ చూడండి:ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం: సీఎం