TTD: తిరుమలలో ఈ రోజు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా టికెట్లను తితిదే విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూన్ 1 నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. ఉదయం 10 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3 గంటలకు దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఆగస్టు నెల గదుల కోటాను గురువారం విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ఇవీ చదవండి:'తెలంగాణకు ఆయిల్‌పామ్ పరిశోధన కేంద్రం ఇవ్వండి..'