వైకుంఠ ద్వార దర్శనం గతంలో మాదిరిగా రెండ్రోజులే మాత్రమే ఉంటుందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు కల్పించాలని కోరుతూ తాళ్లపాక రాఘవన్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం...పిటిషనర్అభ్యర్థనపై వైఖరేంటో తెలపాలని తితిదేని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో అన్నమయ్య భవన్‌లో తితిదే ధర్మకర్తల మండలి అత్యవసరంగా సమావేశమై ఈ విషయాన్ని చర్చించింది. గతంలో మాదిరిగా రెండు రోజుల పాటే వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. సమావేశం అనంతరం ఈ విషయాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే శ్రీవారిని దర్శించుకునే భక్తులకు జనవరి 20 నుంచి ఉచిత లడ్డూ అందజేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. రూ.50కు అదనపు లడ్డూ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
వైకుంఠ ద్వార దర్శనంపై తితిదే కీలక నిర్ణయం - తితిదే బోర్డు సమావేశం
వైకుంఠ ద్వార దర్శనం గతంలో మాదిరిగా రెండ్రోజులే మాత్రమే ఉంటుందని తితిదే వెల్లడించింది. హైకోర్టు సూచనల మేరకు బోర్డు అత్యవసర సమావేశమై ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
వైకుంఠ ద్వార దర్శనంపై తితిదే కీలక నిర్ణయం