తెలంగాణ

telangana

ETV Bharat / city

లాఠీఛార్జ్​ చేయలేదు.. చంద్రబాబు విమర్శలపై తితిదే స్పందన - తిరుమల సమాచారం

తెదేపా అధినేత చంద్రబాబు చేసిన విమర్శలకు తితిదే స్పందించింది. శ్రీవారి మెట్టు వద్ద భక్తుల ఆందోళన సందర్భంగా లాఠీఛార్జ్ చేయలేదని స్పష్టం చేసింది.

tirumala news
లాఠీఛార్జ్​ చేయలేదు.. చంద్రబాబు విమర్శలపై తితిదే

By

Published : Dec 24, 2020, 9:38 AM IST

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. ట్విటర్​లో చేసిన విమర్శలకు సమాధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. శ్రీవారిమెట్టు వద్ద ఆందోళనకు దిగిన భక్తులపై లాఠీఛార్జ్ చేయలేదని స్పష్టం చేసింది. టోకెన్లు ఉన్నవారినే అనుమతిస్తామని భక్తులకు చెప్పినట్టు తెలిపింది. కొవిడ్ నేపథ్యంలో.. దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్న వారు మాత్రమే తిరుమలకు రావాలని ముందే చేసిన ప్రకటనను భక్తులను వివరించినట్టు వెల్లడించింది.

మరోవైపు.. వైకాపా నేతలు.. ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో చేసిన పాదయాత్రలో.. డ్రోన్ వినియోగం గురించి సమాచారం తెలిసిన వెంటనే.. విజిలెన్స్ అధికారులు స్పందించినట్టు తితిదే స్పష్టం చేసింది. ఆ డ్రోన్​ను అధికారులు సీజ్ చేశారని తెలిపింది.

ఇవీచూడండి:శ్రీవారిమెట్టు వద్ద భక్తుల బైఠాయింపు.. ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details