తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తితిదే పత్రికా ప్రకటన విడుదల చేసింది. టికెట్లు జారీలో సంబంధంలేని సుబ్బారెడ్డిపై ఎంపీ ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపణలు ఖండించిన తితిదే - condemned the allegations against yv subba reddy
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణలను తితిదే ఖండించింది. ఈ మేరకు తితిదే పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపణలు ఖండించిన తితిదే
రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు టిక్కెట్లను కేటాయిస్తున్నామన్న తితిదే.. ఎంపీ రఘురామకృష్ణంరాజు సిఫార్సు లేఖలును తిరస్కరించలేదని తెలిపింది. అలాంటి ఘటన ఏమైనా జరిగి ఉండి తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.