తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుపతి వెళ్తున్నారా? ఆ తేదీ వరకే సర్వదర్శనాలు..! - కరోనా ప్రభావంతో తితిదే సర్వదర్శనాల నిలిపివేత న్యూస్

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని ఆదివారం సాయంత్రం నుంచి నిలిపివేయాలని తితిదే నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని 11వ తేదీ సాయంత్రం తరువాత నిలిపివేయాలని తితిదే నిర్ణయించింది.

tirumala
శ్రీవారి సర్వదర్శనం

By

Published : Apr 7, 2021, 10:32 PM IST

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని ఆదివారం సాయంత్రం నుంచి నిలిపివేయాలని తితిదే నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని 11వ తేదీ సాయంత్రం తరువాత నిలిపివేయాలని నిర్ణయించారు. తిరుపతి నగరంలో కూడా కరోనా కేసులు క్ర‌మేణా పెరుగుతున్నాయని తెలిపింది.

తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్య‌లో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముందని తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: ఆరు నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details