TTD TICKETS : నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల - TTD tickets release news
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల(TTD TICKETS)ను తితిదే నేడు విడుదల చేయనుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
![TTD TICKETS : నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13423068-699-13423068-1634865713167.jpg)
నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
ఈరోజు ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(TTD TICKETS)ను తితిదే విడుదల చేయనుంది. రేపు ఉదయం 9 గం.కు సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి రోజుకు 12 వేల టికెట్లు చొప్పున రూ.300 టికెట్లు(TTD TICKETS) విడుదల చేయబోతున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. కేవలం నవంబర్ నెలకు మాత్రమే సంబంధించిన సర్వదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.