TTD TICKETS: జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి.. సేవా, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను.. తితిదే గురు, శుక్రవారాల్లో విడుదల చేయనుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను.. వర్చువల్ పద్ధతిలో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ సాయంత్రం 4గంటలకు.. సేవా దర్శన టికెట్లు విడుదల చేయనుండగా.. శుక్రవారం రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటా విడుదల చేయనున్నారు.
TTD TICKETS: నేడు, రేపు జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల - తెలంగాణ వార్తలు
TTD TICKETS: జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి.. సేవా, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను.. తితిదే ఈరోజు, రేపు విడుదల చేయనుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను.. వర్చువల్ పద్ధతిలో విడుదల చేయనున్నారు.
జనవరి 1, 2, 13 నుంచి 22, 26 తేదీలకు సంబంధించి 5,500 టికెట్లు.. శుక్రవారం ఉదయం 9గంటలకు.. రోజుకు 20 వేల టికెట్లు విడుదల చేయనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.
జనవరి 13 నుంచి 22 వరకు ఉత్తర ద్వార దర్శనం దృష్ట్యా రోజుకు 20 వేల టికెట్లు.. 1, 2 తేదీల్లో నూతన సంవత్సరం దృష్ట్యా అదనంగా 8 వేల టికెట్లు ఇవ్వనున్నారు. జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31 తేదీల టికెట్లు శుక్రవారం విడుదల కానుండగా.. రోజుకు 12 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. ఈనెల 27న ఉదయం 9 గంటలకు తిరుమల వసతి గదుల బుకింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. జనవరి 11 నుంచి 14 వరకు వసతి గదుల కోసం తిరుమలలో కరెంట్ బుకింగ్ చేసుకోవచ్చని తితిదే తెలిపింది.