తెలంగాణ

telangana

ETV Bharat / city

24 మందితో తితిదే పాలకమండలి - latest news on ttd governing body

తితిదే పాలక మండలి సభ్యులు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.  ఈమేరకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీకి చెందిన 24 మందితో ప్రకటన వెలువడవచ్చని ఏపీ సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

24 మందితో తితిదే పాలకమండలి

By

Published : Sep 18, 2019, 8:35 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలిలో... తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీకి చెందిన 24 మందిని నియమించనున్నట్టు సమాచారం. ఒకటి రెండు పేర్లపై తర్జనభర్జనలు చోటుచేసుకోవటం వల్ల జాబితా ప్రకటనలో ఆలస్యమైందని .... నేడు ప్రకటన వెలువడవచ్చని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు

ఏపీ నుంచి ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున రెడ్డి, యూవీ రమణమూర్తి, గొల్ల బాబూరావు, కె. పార్థసారథి. ఇతరుల కోటాలో వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి, నాదెండ్ల సుబ్బారావు, వైకాపా ప్రొద్దుటూరు నగర అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌, తెలంగాణ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వరరావు, డి.దామోదర్​రావు, హెటిరో డ్రగ్స్ ఎండీ బి.పార్థసారథి రెడ్డి, కావేరి సీడ్స్ ఎండీ భాస్కరరావు సతీమణి జి.వనజాదేవి, మూరంశెట్టి రాములు, కె.శివకుమార్, పుత్తా ప్రతాప్‌ రెడ్డి, తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్, డాక్టర్ నిచితా ముత్తవరపు, ఎమ్మెల్యే కుమారగురు, కర్ణాటక నుంచి రమేశ్ శెట్టి, సంపత్ రవినారాయణ, డీపీ ఆంత, సుధా నారాయణమూర్తి, మహరాష్ట్ర నుంచి రాజేశ్ శర్మ, దిల్లీ నుంచి ఎంఎస్ శివశంకరన్​కు అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది.

తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి సంపత్ రవినారాయణ, డీపీ ఆంత, సుధా నారాయణమూర్తి గతంలోనూ సభ్యులుగా పనిచేశారు. గతంలో తమిళనాడు నుంచి ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చిన దాఖలాల్లేవు. ముఖ్యమంత్రి పళనిస్వామి సిఫార్సుపై తొలిసారిగా ఉలుందూర్ పేట ఎమ్మెల్యేకు చోటు కల్పిస్తున్నారని చెబుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కోరిక మేరకు డాక్టర్ నిచితా ముత్తవరపునకు అవకాశమిచ్చినట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి: తిరుమల బ్రహ్మోత్సవాలకు.. విస్తృత ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details