తెలంగాణ

telangana

ETV Bharat / city

Tirumala: తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం.. విజిలెన్స్​ విచారణ ప్రారంభం - tirumala fake ticket latest news

తిరుమలలో నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్​కు చెందిన భక్తులు శ్రీవారి దర్శన టికెట్ల కోసం దళారులను ఆశ్రయించారు. నకిలీ టికెట్లను ఆ భక్తులకు దళారులు అంటగట్టారు. క్యూలైన్​లో తనిఖీ సందర్భంగా.. తితిదే సిబ్బంది గుర్తించారు.

ttd found fake tickets in tirumala
ttd found fake tickets in tirumala

By

Published : Aug 12, 2021, 8:34 PM IST

తిరుమలలో నకిలీ టికెట్ల వ్యవహారం మరోసారి వెలుగుచూసింది. హైదరాబాద్​కు చెందిన కొందరు భక్తులు శ్రీవారి కల్యాణోత్సవ టికెట్ల కోసం దళారులను ఆశ్రయించారు. దళారులు నకిలీ టికెట్లను ఇచ్చారు. వాటితోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్​కు వచ్చారు.

అక్కడ టికెట్ స్కాన్ కాకపోవటంతో వ్యవహారం బయటపడింది. టికెట్​ను రూ. 4,400 చొప్పున కొనుగోలు చేసినట్లు భక్తులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు.. ముఠాను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. నకిలీ టికెట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీవారి భక్తులకు అధికారులు సూచించారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.

ఇదీచూడండి:Amith Shah: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న అమిత్​షా

ABOUT THE AUTHOR

...view details