మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలోని వేద పాఠశాలను తితిదేఈవో జవహర్ రెడ్డి సందర్శించారు. వేద పాఠశాల హాస్టల్ భవనం, తరగతి గదులు, ప్రార్థనా మందిరం, భోజనశాలను పరిశీలించారు. వేదపాఠశాల ప్రధానోపాధ్యాయులతో.. పాఠశాలలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు.
వేద పాఠశాల హాస్టల్ భవనం 40 మంది విద్యార్థుల కోసం నిర్మించారనీ... ప్రస్తుతం 120 మంది విద్యార్థులు ఉంటున్నారని ఈవో దృష్టికి తీసుకువచ్చారు. అదనపు తరగతి గదులు సైతం నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించారు. యాగశాల, పాఠశాల పరిసరాల్లోకి వన్య మృగాలు రాకుండా ప్రహారీ గోడ నిర్మించాలని ఈవోను కోరారు. ఈ పనులన్నింటికీ అంచనాలు తయారు చేసి.. పంపించాలని ఇంజినీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు.