ఎస్వీ వేదవిశ్వవిద్యాలయం, కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతులతో పాటు మరో నలుగురు వేద పండితులతో.. ఆంజనేయుడి జన్మస్థలం నిర్ధారణ కమిటీ నియమించినట్లు తితిదే ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు. కిష్కింద, నాసిక్లు హనుమంతుడి జన్మ క్షేత్రాలుగా ప్రచారంలో ఉండగా.. వివిధ ఆధారాలను కమిటీ సభ్యులు పరిశీలిస్తారన్నారు.
మూడు నెలల్లో ఆంజనేయుడి జన్మస్థలంపై నివేదిక: తితిదే ఈవో - ఆంజనేయుడి జన్మస్థలం నిర్ధారణ కమిటీ నివేదిక గురించి తితిదే ఈవో ప్రకటన
ఆంజనేయుడి జన్మస్థలం తేల్చడానికి తితిదే నియమించిన కమిటీ.. మూడు నెలల్లో నివేదికను సమర్పిస్తోందని ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. పౌరాణిక, చారిత్రక ఆధారాలను లభిస్తేనే.. ధర్మకర్తల మండలిలో చర్చించి అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
మూడు నెలల్లో ఆంజనేయుడి జన్మస్థలంపై నివేదిక!: తితిదే ఈవో
ఆంజనేయుడు తిరుమల గిరుల్లో జన్మించినట్లు పౌరాణిక, చారిత్రక ఆధారాలు లభిస్తే.. తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి, అధికారికంగా ప్రకటిస్తామని ఈవో తెలిపారు. మూడు నెలల కాలపరిమితితో నివేదిక అందచేయాలని పండితులకు సూచించినట్లు వెల్లడించారు.
సంబంధిత కథనం: ఆంజనేయుడి జన్మస్థల నిర్ధారణ కోసం తితిదే కమిటీ