తెలంగాణ

telangana

ETV Bharat / city

తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బదిలీ - టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ తాజా వార్తలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బదిలీ అయ్యారు. ఆయన్ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్​ఛార్జి ఈవోగా ధర్మారెడ్డిని నియమించింది. అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ttd eo anil kumar singhal Transfer
తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బదిలీ

By

Published : Oct 1, 2020, 12:54 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్​ను ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను దేవాదాయశాఖ నుంచి వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ కుమార్​ సింఘాల్​ను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. తితిదే ఇన్​ఛార్జి‌ ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డిని ప్రభుత్వం నియమించింది.

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ధర్మారెడ్డి ఈవోగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ప్రభుత్వం వెల్లడించింది. మరో వైపు తితిదే ఈవోగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ జవహర్‌ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ 2017 మే 1 నుంచి తితిదే ఈవోగా కొనసాగుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details