50 రోజుల తర్వాత తిరుమల శ్రీవారి లడ్డును భక్తులకు తితిదే అందుబాటులోకి తెచ్చింది. మార్చి 20న శ్రీవారి దర్శనాలను ఆపివేసిన తితిదే తిరుమలలో లడ్డూ తయారీతో పాటు విక్రయాలను నిలిపివేసింది. శ్రీవారి కల్యాణోత్సవ ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులకు అందజేసే పెద్ద లడ్డూ, వడ ఈరోజు నుంచి తితిదే అందిస్తోంది. స్వామి వారి సేవలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తున్నప్పటికి దిట్టం ప్రకారం స్వామి వారికి సమర్పించే ప్రసాదాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు.
'లడ్డూ కావాలా నాయనా.. అందుబాటులోకి శ్రీవారి ప్రసాదం'
దాదాపు 50 రోజుల తర్వాత తిరుమల శ్రీవారి లడ్డూను భక్తులకు తితిదే అందుబాటులోకి తెచ్చింది. మార్చి 20 నుంచి దర్శనాలను నిలిపివేసిన తితిదే.. లడ్డు తయారీతో పాటు విక్రయాలను ఆపేసింది. స్థానికులకు శ్రీవారి ప్రసాదాలు అందించే లక్ష్యంతో ఏర్పాట్లు చేసింది.
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/15-May-2020/7213631_393_7213631_1589553080154.png
గతంలో ఈ లడ్డూలను ఆర్జితసేవలో పాల్గొనే భక్తులకు అందజేసేవారు. లాక్డౌన్ నేపథ్యంలో భక్తుల దర్శనాలను నిలిపివేయడంతో ప్రసాదాలను తిరుపతి పరిపాలనా భవనానికి తరలిస్తున్నారు. ప్రత్యేకంగా విక్రయ కేంద్రం ఏర్పాటు చేసి శ్రీవారి పెద్ద లడ్డూ, వడలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. స్థానికులకు శ్రీవారి ప్రసాదాలు అందించే లక్ష్యంతో తితిదే ఏర్పాట్లు చేసింది.
ఇదీచూడండి.చిత్తూరు జిల్లాలో చిరుత పులి సంచారం
Last Updated : May 16, 2020, 7:20 AM IST