తెలంగాణ

telangana

ETV Bharat / city

TTD CHAIRMAN YV SUBBA REDDY : తిరుపతిలో గో మహాసమ్మేళనం.. ఎప్పుడంటే? - తిరుమలలో 150 గోవులతో గోశాల అభివృద్ధి

తిరుపతిలో గో మహాసమ్మేళనం నిర్వహించబోతున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(TTD CHAIRMAN YV SUBBA REDDY) తెలిపారు. శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసిన అరగంటలోనే.. 4 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నట్లు వివరించారు.

TTD chairman YV Subba Reddy
TTD chairman YV Subba Reddy

By

Published : Oct 22, 2021, 3:07 PM IST

ఈనెల 30, 31 తేదీల్లో గో మహాసమ్మేళనం నిర్వహించబోతున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి(TTD CHAIRMAN YV SUBBA REDDY) తెలిపారు. ఈ మహాసమ్మేళనంలో రైతులకు.. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. తిరుమలలో 150 గోవులతో గోశాల అభివృద్ధి చేస్తామన్న ఆయన.. శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచినట్లు చెప్పారు.

భక్తులు అరగంటలోనే 4 లక్షల టికెట్లు పొందినట్లు ఛైర్మన్ సుబ్బారెడ్డి(TTD CHAIRMAN YV SUBBA REDDY) వెల్లడించారు. టికెట్ల కేటాయింపులో ఈసారి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని చెప్పారు. నడకదారి భక్తులకు టికెట్లు కావాలని కోరుతున్న సుబ్బారెడ్డి.. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details