రేపటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు(Tirumala Srivari Brahmotsavam) ప్రారంభం కానున్నాయి. గురువారం సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు(Srivari Brahmotsavam) ప్రారంభమవుతాయని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 11న ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఛైర్మన్ వెల్లడించారు.
ఈనెల 12 నుంచి చిన్న పిల్లల ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభమవుతాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నెల రోజుల్లో శస్త్ర చికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. బర్డ్ ఆసుపత్రిలో రూ.25 కోట్లతో చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధి. ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లు సీఎం జగన్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్ణాటక సీఎం పాల్గొంటారుని సుబ్బారెడ్డి తెలిపారు.