తెలంగాణ

telangana

ETV Bharat / city

TTD NEWS: తిరుమలలో డిపాజిట్ రిటర్న్ లేటవుతోంది.. ఎందుకు? - Ttd caution deposit latest news

తిరుమల తిరుపతి దేవస్థానంలో గదుల కేటాయింపునకు తితిదే తీసుకుంటున్న కాషన్ డిపాజిట్ చెల్లింపు ఆలస్యం అవుతుంది. 1,2 రోజుల్లో భక్తుల ఖాతలో జమవుతుందని అధికారులు చెబుతున్నా... కొంత మందికి పది రోజులపైనే సమయం పడుతోంది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నవారికి గది ధరను బట్టి కాషన్‌ డిపాజిట్‌ తీసుకుంటున్నారు. రూ.500 నుంచి రూ.6వేల వరకున్న గదులకు అంతే మొత్తాన్ని కాషన్‌ డిపాజిట్‌గా వసూలు చేస్తున్నారు.

TTD NEWS
TTD NEWS

By

Published : Oct 3, 2021, 2:11 PM IST

తిరుమలలో గదుల కేటాయింపునకు తితిదే తీసుకుంటున్న కాషన్‌ డిపాజిట్‌ పది రోజులకు కూడా భక్తుల ఖాతాలోకి చేరడం లేదు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నవారికి గది ధరను బట్టి కాషన్‌ డిపాజిట్‌ తీసుకుంటున్నారు. రూ.500 నుంచి రూ.6వేల వరకున్న గదులకు అంతే మొత్తాన్ని కాషన్‌ డిపాజిట్‌గా వసూలు చేస్తున్నారు. రూ.50 ఉన్న గదికి కూడా రూ.500 డిపాజిట్‌గా తీసుకుంటారు. గదులను ఖాళీ చేసినప్పుడు 1,2 రోజుల్లో ఈ మొత్తం తిరిగి భక్తుడి బ్యాంకు ఖాతాలో జమవుతుందని తితిదే సిబ్బంది చెబుతున్నా... కొంతమందికి పది రోజులకుపైగా సమయం పడుతోంది.

దీనిపై అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి గత నెల సంబంధిత అధికారులతో సమావేశమై సిబ్బందిని అప్రమత్తం చేసినప్పటికీ ఇంకా వేగవంతం కాలేదు. కాషన్‌ డిపాజిట్‌ సకాలంలో జమ కానట్లయితే తితిదే వెబ్‌సైట్‌ cdmcttd@tirumala.orgకి కానీ తితిదే టోల్‌ఫ్రీ నంబరుకుగానీ ఫిర్యాదు చేయవచ్చని చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి సందీప్‌ సూచించారు. 3,4 రోజుల్లోనే కాషన్‌ డిపాజిట్‌ ఖాతాల్లో జమవుతోందని తెలిపారు.

దర్శన టికెట్లు, టీకా పత్రం ఉంటేనే అనుమతి...

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు 72గంటల ముందు పరీక్ష చేయించుకున్న ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉంటేనే అనుమతిస్తామని తితిదే సీవీఎస్‌వో గోపినాథ్‌ జెట్టి తెలిపారు. శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు, తితిదే సీవీఎస్‌వో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తితిదే నిఘా, భద్రతా విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సమీక్షలో అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, వీజీవో బాలిరెడ్డి, ఏవీఎస్‌వోలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:TTD News : తితిదేలో వినియోగించిన పూలతో కళాకృతులు

ABOUT THE AUTHOR

...view details