తెలంగాణ

telangana

ETV Bharat / city

జనవరిలో తితిదే విశేష పర్వదినాలు ఇవే... - tirumala temple latest news

నూతన సంవత్సరం ఆరంభం కానుండటంతో శ్రీవారి ఆలయంలో నిర్వహించబోయే విశేష పర్వదినాలను తితిదే ప్రకటించింది. జనవరి నెలలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి.

tirumala news
జనవరిలో తితిదే నిర్వహించబోయే విశేష పర్వదినాలు

By

Published : Dec 29, 2020, 11:01 PM IST

కొత్త సంవత్సరం ఆరంభం జనవరి నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాలను తితిదే ప్రకటించింది. ప్రధానంగా క‌నుమ పండుగ‌, శ్రీ గోదా ప‌రిణ‌యోత్స‌వం, శ్రీ‌వారి శ్రీ పార్వేట ఉత్స‌వం, శ్రీ రామ‌కృష్ణతీర్థ ముక్కోటి వంటి పర్వదినాలు ఉన్నాయి.

జ‌న‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు:

  • జ‌న‌వ‌రి 7న అధ్య‌య‌నోత్స‌వాలు స‌మాప్తి
  • జ‌న‌వ‌రి 8న తిరుమల‌నంబి స‌న్నిధికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు వేంచేపు
  • జ‌న‌వ‌రి 9, 24వ తేదీల్లో స‌ర్వ ఏకాద‌శి
  • జ‌న‌వ‌రి 10న శ్రీ తొండ‌ర‌డిప్పొడియాళ్వార్ వ‌ర్ష తిరున‌క్ష‌త్రం
  • జ‌న‌వ‌రి 13న భోగి పండుగ‌
  • జ‌న‌వ‌రి 14న మ‌క‌ర సంక్రాంతి
  • జ‌న‌వ‌రి 15న క‌నుమ పండుగ‌, శ్రీ గోదా ప‌రిణ‌యోత్స‌వం, తిరుమ‌ల శ్రీ‌వారి శ్రీ పార్వేట ఉత్స‌వం
  • జ‌న‌వ‌రి 28న శ్రీ రామ‌కృష్ణతీర్థ ముక్కోటి
  • జ‌న‌వ‌రి 30న శ్రీ తిరుమొళిశైయాళ్వార్ వ‌ర్షతిరున‌క్ష‌త్రం

ఇవీచూడండి:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు

ABOUT THE AUTHOR

...view details