తెలంగాణ

telangana

ETV Bharat / city

మార్చి నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి - తితిదే న్యూస్

శ్రీవారి భక్తులకు తితిదే శుభవార్త చెప్పింది. ఆర్జిత సేవలకు మార్చి నుంచి భక్తులను అనుమతించనున్నట్లు తితిదే అధికారులు ప్రకటించారు.

ttd
ttd

By

Published : Feb 6, 2021, 9:33 AM IST

మార్చి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చెన్నైలోని టీనగర్‌లో భక్తులు తితిదేకు ఇచ్చిన స్థలంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఈనెల 13న భూమిపూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

విశాఖపట్నం, అమరావతిలలో తితిదే ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాలను ఏప్రిల్‌ తరువాత ప్రారంభిస్తామని తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.

రథసప్తమికి సంబంధించి కేవలం టికెట్లు ఉన్న భక్తులనే... తిరుమల కొండమీదకు అనుమతించనున్నట్లు తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్ ‌రెడ్డి చెప్పారు. తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా ఒకరోజు ముందు టికెట్లు తీసుకోవచ్చని శుక్రవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో తెలిపారు.

ఇదీ చదవండి:సినిమా రేంజ్​లో ఓ భార్య క్రైమ్​ కథ.. భర్తను చంపించి ఆపై..

ABOUT THE AUTHOR

...view details