తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2021, 10:43 AM IST

ETV Bharat / city

Tirumala Temple News : తిరుమల ఘాట్‌ రోడ్లలో భక్తులకు అనుమతి

ఈరోజు ఉదయం 6 గంటల నుంచి తిరుమల ఘాట్ రోడ్ల(Tirumala Ghat road)లో భక్తులకు అనుమతి కల్పిస్తున్నట్లు తితిదే(TTD) అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా నిన్న రాత్రి 8 గంటల నుంచి రెండు కనుమదారులను మూసివేశారు.

Tirumala
Tirumala

తిరుమల ఘాట్‌ రోడ్ల(Tirumala Ghat road)లో తితిదే భక్తుల(devotees)ను అనుమతిస్తోంది. వర్షం తగ్గడంతో ఉదయం 6 నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు చెప్పారు. భారీ వర్షం కారణంగా నిన్న రాత్రి 8 గంటలకు 2 కనుమదారులు మూసివేశారు. మెట్ల మార్గంలో భారీగా వరద నీరు చేరడంతో జలపాతాన్ని తలపించింది. అటవీ ప్రాంతంలో నుంచి వచ్చిన బురద నీటితో మెట్లపై మట్టి పేరుకుపోయింది.

దీంతో.. ఈ మార్గాన్ని మూసివేసి భక్తుల రాకపోకలను నిలిపివేశారు. పేరుకుపోయిన బురదను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. నడిచి కొండపైకి వెళ్లాలనే భక్తులను శ్రీవారి మెట్ల మార్గం నుంచి అనుమతిస్తున్నారు. జలపాతాన్ని తలపించేలా ప్రవహించిన వరదనీటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details