తెలంగాణ

telangana

ETV Bharat / city

90 రోజుల్లో ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చు! - తిరుమల సర్వ దర్శనం తాజా వార్తలు

కరోనా ప్రభావంతో తిరుమల దర్శనానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. ఇప్పటివరకు దర్శన టికెట్లు ఉన్నవారూ శ్రీవారి దర్శనానికి రావడం లేదు. తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 నుంచి 30 వరకు టికెట్లు కొనుగోలు చేసిన వారు 90 రోజుల్లో ఎప్పుడైనా రావచ్చని ప్రకటించింది.

tirumala, tirumala news
తిరుమల, తిరుమల న్యూస్, తిరుమల వార్తలు

By

Published : Apr 19, 2021, 7:24 AM IST

కరోనా ప్రభావంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతుండడంతో తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. గత వారం రోజుల్లో కొవిడ్‌ కేసులు అధికంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి యాత్రికుల రాక భారీగా తగ్గుతోంది. టికెట్లు పొందినవారిలో దాదాపు 30 శాతం మంది.. స్వామివారి దర్శనానికి రావడంలేదు. టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి తితిదే నూతన వెసులుబాటు కల్పించింది.

ఈ నెల 21 నుంచి 30 వరకు టిక్కెట్లు కలిగినవారు 90 రోజుల్లో ఎప్పుడైనా స్వామివారి దర్శనానికి రావొచ్చని ప్రకటించింది. దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని తితిదే విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చేభక్తులు కొవిడ్‌ నియమాలు పాటించాలని కోరింది.

ABOUT THE AUTHOR

...view details