సామాజిక మాధ్యమాల్లో తితిదేపై అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంపై ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలలో అన్యమత గుర్తులు ఉన్నాయంటూ జరిగిన ప్రచారంపై అదనపు ఈవో స్పందించారు.
'తితిదేపై అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం'
తిరుమల తిరుపతి దేవస్థానంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అదనపు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాటు చేసిన పూర్ణ కలశాన్ని శిలువగా చిత్రీకరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ttd
అధికారులతో కలసి ఆలయం వద్దకు చేరుకున్న ఆయన భక్తులను పిలిపించి.. ఆలయంపై ఏర్పాటు చేసిన వాటిలో అన్యమతానికి సంబంధించి ఏమైనా గుర్తులు ఉన్నాయా అని ప్రశ్నించారు. సంప్రదాయంగా హనుమంత.. పూర్ణకుంభం.. గరుడ రూపాలలో అలంకరణలు చేశామన్నారు. పూర్ణ కలశాన్ని శిలువగా చిత్రీకరించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.