ముస్లిం మైనార్టీల కోసం దేశ వ్యాప్తంగా ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ, బిహార్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఎంఐఎం అభ్యర్థులకు హైదరాబాద్ పాతబస్తీ నాంపల్లిలోని దారుసలాంలో అభినందన సభ నిర్వహించారు.
ఆర్టీసీని ప్రైవేటీకరించినా... 'జడ్' కొనసాగించాలి: అసద్ - AIMIM
మహారాష్ట్ర అసెంబ్లీ, బిహార్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఎంఐఎం అభ్యర్థులకు హైదరాబాద్ పాతబస్తీ నాంపల్లిలోని దారుసలాంలో అభినందన సభ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ ప్రతిపాదనను అంగీకరించి తక్షణమే విధుల్లో చేరాలని కోరారు. రాజకీయ పార్టీల బారిన పడకుండా నేరుగా సీఎంను కలిసి సమస్యలు పరిష్కారమయ్యేలా చూసుకోవాలన్నారు.
"ఆర్టీసీ కార్మికులు రాజకీయ వలలో చిక్కొద్దు"
ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ ప్రతిపాదన అంగీకరించి తక్షణమే విధుల్లో చేరాలన్నారు. రాజకీయ పార్టీల బారిన పడకుండా నేరుగా ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు పరిష్కారమయ్యేలా చూసుకోవాలని అసదుద్దీన్ సూచించారు. ఒకవేళ ఆర్టీసీని ప్రైవేటీకరించాల్సి వస్తే... ఆర్టీసీ బస్సుల రిజిస్ట్రేషన్లో ఉండే జడ్ అక్షరం తొలగించొద్దని సీఎంను కోరారు. నిజాం కుటుంబానికి చెందిన జెహ్రా అనే పేరుపై ఆ అక్షరం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.