తెలంగాణ

telangana

ETV Bharat / city

TSRTC NEWS: టీఎస్​ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఇక నుంచి ఒకటో తేదీనే జీతాలు

టీఎస్​ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
టీఎస్​ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

By

Published : Oct 1, 2021, 9:02 AM IST

08:39 October 01

TSRTC NEWS : ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఒకటో తేదీనే జీతాలు

ఆర్టీసీ ఉద్యోగుల(TSRTC NEWS)కు శుభవార్త. మూడేళ్ల తర్వాత ఒకటో తేదీన టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులంతా జీతాలు అందుకోనున్నారు. ఇకపైనా ప్రతి నెలా ఒకటిన జీతాలు చెల్లించాలని సంస్థ ఎండీ సజ్జనార్‌(TSRTC MD SAJJANAR) ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. తీవ్ర నష్టాలతో ప్రతి నెలా 7 నుంచి 14 లోపు విడతలు, జోన్ల వారీగా జీతాలు చెల్లించడానికి అవస్థలు పడుతున్న సంస్థ.. దసరా పండగ వేళ అక్టోబరు 1న అందరికీ జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. ఇటీవల ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్‌.. ప్రతి నెలా 1న జీతాలు(TSRTC NEWS) చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. దాదాపు 48 వేల మంది ఉద్యోగులు, పింఛనుదారులు ఒకటో తేదీన వేతనాలు(TSRTC NEWS) అందుకోనున్నారు.

ప్రతి నెలా మొదటి రోజునే వేతనాల(TSRTC NEWS)కు అవసరమైన మొత్తాన్ని ఓడి (ఓవర్‌డ్రాఫ్ట్‌) కింద సమకూర్చి ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలుస్తుంది. 47 వేల మందికిపైగా ఉద్యోగులకు నెలనెలా వేతనాలకు రూ.230 కోట్లకు పైగా అవసరమవుతాయి. పీఎఫ్‌ సుమారు రూ.40 కోట్లు, సీసీఎస్‌ రూ.30 కోట్లు మొత్తం రూ.70 కోట్లను ఆర్టీసీ ఆ తర్వాత సర్దుబాటు చేసుకుంటుందని సమాచారం. ఈ మొత్తాన్ని మినహాయించి వేతనాల వరకు సుమారు రూ.160 కోట్లు ఓడీ కింద బ్యాంకు సమకూర్చడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది.

దీర్ఘకాలిక సెలవులిస్తాం.. దరఖాస్తు చేసుకోండి

టీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లకు దీర్ఘకాలిక సెలవులు ఇచ్చేందుకు సంస్థ ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఈ సెలవులపై అప్రకటిత ఆంక్షలున్నాయి. తాజాగా వాటిని సడలిస్తూ దరఖాస్తు చేసుకుంటే ఏడాది సెలవులు ఇస్తామంటూ ఉత్తర్వులు జారీచేసింది.

ABOUT THE AUTHOR

...view details