TSRTC Sankranti special buses: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు టీఎస్ఆర్టీసీ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతుందని.. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈనెల 7 నుంచి 14 వరకు బస్సులను నడపనున్నామని తెలిపారు. పండుగ సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు సహా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (MGBS), జూబ్లీ బస్‌స్టేషన్ (JBS), సీబీఎస్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్, ఆరాంఘర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, టెలిఫోన్‌భవన్, దిల్సుఖ్నగర్ నుంచి బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో నివసించేవారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సు సర్వీసుల పర్యవేక్షణకు సుమారు 200 మంది అధికారులు, సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. www.tsrtconline.in వెబ్సైట్లో మందస్తు రిజర్వేషన్ చేసుకొనే అవకాశం కల్పించినట్లు చెప్పారు.
తెలంగాణలో..