ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదిన కూకట్పల్లి వాసులు
మద్యం మత్తులో బస్సును నడిపాడని హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ ఆర్టీసీ డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. తాను మద్యం సేవించలేదని, నిద్రలోంచి లేచి నేరుగా బస్సు నడపడం వల్ల ప్రమాదం జరిగిందని డ్రైవర్ రసూల్ తెలిపాడు.
ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలని సమ్మె చేస్తున్న నేపథ్యంలో, సమ్మెను నిర్వీర్యం చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపే ప్రయత్నం చేస్తోంది. అనుభవరాహిత్యం మూలంగా తాత్కాలిక సిబ్బంది డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవటం సర్వ సాధారణంగా మారింది. ఈరోజు ఉదయం హైదరాబాద్-2 డిపోకు చెందిన బస్సు దిల్సుఖ్నగర్ నుంచి పరిగి వెళ్తోన్న క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల, ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సును కూకట్పల్లి వై జంక్షన్ వద్ద వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం సేవించి బస్సు నడిపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. నిద్రలోంచి లేచి నేరుగా బస్సు నడపడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని, మద్యం సేవించలేదని డ్రైవర్ రసూల్ తెలిపాడు.
- ఇదీ చూడండి : ఆగని ఆర్టీసీ కార్మికుల బలిదానాలు