తెలంగాణ

telangana

ETV Bharat / city

ఛలో ట్యాంక్​బండ్ ఉద్రిక్తం... బాష్పవాయువు ప్రయోగం..

తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేస్తుంటే లాఠీఛార్జ్ చేస్తారా?అంటూ ఆర్టీసీ కార్మికులు పోలీసులపై విరుచుకుపడ్డారు. కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న ఛలో ట్యాంక్​బండ్​ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సీపీఎం కార్యకర్తలతో కలిసి కార్మికులు ఒక్కసారిగా ట్యాంక్​ బండ్ పైకి దూసుకురావడంతో.. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే ర్యాపిడ్‌ యాక్షన్‌ బలగాలు భాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో... ఆప్రాంతం రణరంగంగా మారింది.

లాఠీఛార్జి చేసినా? ఇక్కడి నుంచి కదలం..!

By

Published : Nov 9, 2019, 3:31 PM IST


ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న ఛలో ట్యాంక్​బండ్​ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ట్యాంక్‌బండ్‌ వద్దకు చేరుకున్న ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు, ఓయూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, విపక్ష నేతలను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

అరెస్టులు, ఆందోళనలు

ఆర్టీసీ కార్మికులు, విద్యార్థి సంఘాల నేతలు వెంకటస్వామి విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తుండగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురు నేతలతో పాటు 300 మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

లాఠీఛార్జ్ చేసినా? చంపినా కదలం..!

తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేస్తుంటే తమపై లాఠీఛార్జ్ చేస్తారా? అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తాళ్లతో నెడుతూ ఆందోళనకారులను లిబర్టీ వైపు పంపారు. రంగంలోకి దిగిన ర్యాపిడ్‌ యాక్షన్‌ బలగాలు బాష్ప వాయు గోళాలను ప్రయోగించాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

లాఠీఛార్జి చేసినా? ఇక్కడి నుంచి కదలం..!

ఇదీ చదవండి: ఛలో ట్యాంక్‌బండ్‌: లిబర్టీలో అశ్వత్థామరెడ్డి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details