తెలంగాణ

telangana

ETV Bharat / city

TSRTC Employees Samme: ఆ 2 తేదీల్లో ఆర్టీసీ బస్సులు బంద్

TSRTC Employees Samme: ఈ నెల 28, 29 తేదీల్లో ఆర్టీసీ సంఘాలు సమ్మెలో పాల్గొననున్నాయి. జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఆర్టీసీ జేఏసీ సంఘాలు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి.

TSRTC strike on 28th and 29th of march in telangana
TSRTC strike on 28th and 29th of march in telangana

By

Published : Mar 11, 2022, 7:52 PM IST

TSRTC Employees Samme: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఆర్టీసీ జేఏసీ సంఘాలు యాజమాన్యానికి సమ్మె నోటీసు జారీ చేశాయి. బస్​భవన్​లోని ఆర్టీసీ ఛైర్మన్ పేషీలో సమ్మె నోటీసులు ఇచ్చాయి. ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజులపాటు సమ్మెలో పాల్గొననున్నట్లు జేఏసీ వెల్లడించింది. ఎంవీ యాక్ట్ చట్టం-2019ను పునరుద్ధరించాలని, టూరిస్ట్ పర్మిట్ పాలసీని రద్దు చేయాలని జేఏసీ డిమాండ్​ చేసింది. వాటితో పాటు పెట్రోల్, డీజిల్​పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని, రాష్ట్ర వ్యాట్​ను తగ్గించాలంది.

"కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ.. జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఆర్టీసీ జేఏసీ సంఘాల తరఫున సమ్మెకు మద్దతిచ్చాం. ఈ నెల 28, 29 తేదీల్లో సమ్మెలో పాల్గొంటున్నామని యాజమాన్యానికి నోటీసులిచ్చాం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ డ్యూటీని పెంచి ఆర్టీసీ నడ్డివిరుస్తోంది. బల్క్​ ఆపరేటర్​ పేరు మీద 7 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ.. రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా.. కార్మిక సమస్యలపై స్పందించట్లేదు. ఆర్టీసీ నష్టాలను పూరించేందుకు బడ్జెట్​లో 2 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని అడిగితే.. కేవలం 1500 కోట్లు కేటాయించడాన్ని ఖండిస్తున్నాం. అందులో 1200 కోట్లు రియంబర్స్​మెంట్​కే పోతే.. మిగిలిన మూడు వందల కోట్లు దేనికి సరిపోవు. ఆర్టీసీ కార్మికులకు రెండు వేతన సవరణలు చేయాల్సి ఉంది. 6 డీఏలు రావాల్సి ఉంది. రిటైర్మెంట్​ కార్మికులకు సెటిల్మెంట్​ నగదు బకాయి ఉంది. సీసీఎస్​కు బకాయి ఉంది. కాబట్టి.. ప్రభుత్వం కూడా పద్ధతి మార్చుకోవాలి." -రాజిరెడ్డి, ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details