ఆర్టీసీ సమ్మె ప్రభావంతో నగరవాసులు మెట్రో రైళ్లలోను ఎక్కువగా వినియోగించుకుంటున్నారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సాధారణ రోజుల్లో సుమారు 3 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుండగా... ప్రస్తుతం మరో 50 వేల మంది అధికంగా ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. మియాపూర్ స్టేషన్లో రద్దీని ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరిగిందన్నారు. హైదరాబాద్ మెట్రోను ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
ఆర్టీసీ సమ్మె ప్రభావంతో కిటకిటలాడుతున్న మెట్రో... - METRO TRAINS TIMINIGS
హైదరాబాద్లో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ సమ్మె దృష్ట్యా... నగరవాసులు మెట్రో ప్రయణానికే మొగ్గు చూపిస్తున్నారు. సాధారణ రోజులకంటే సమ్మె రోజుల్లో సుమారు 50 వేల మంది అధికంగా ప్రయాణిస్తున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు.
TSRTC STRIKE EFFECT: HEAVY FLOW OF PASSENGERS TO METRO RAILS IN HYDERABAD