ఆర్టీసీ ఐకాస తలపెట్టిన ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటికి తాళాలు వేసి ఉండగా.. ఆర్టీసీ కార్మికులు నివాసాల ముందే నిరసన ప్రదర్శన చేపట్టారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లడంపై ఘాటైన విమర్శలు చేశారు. ఆర్టీసీ కోకన్వీనర్ రాజిరెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ధర్నా కొనసాగిస్తామని తెలిపారు.
ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు
ఆర్టీసీ కార్మిక నేతలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి నివాసాలను ముట్టడించారు. ముందే ఇళ్లుకు తాళాలు వేసుకుని వెళ్లడం వల్ల ఇంటి ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు