తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మె నేటితో ఐదోరోజుకు చేరుకుంది. ఈనెల ఐదో తేదీ నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో టీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తుందని ఈ సమావేశానికి అన్ని రాజకీయపక్షాలను ఆహ్వానించామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా హాజరుకావాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలతో కార్యచరణ రూపొందించడానికి సీఐటీయూ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి సాయిబాబు తెలిపారు.
ఐదో రోజుకు చేరుకున్న సమ్మె... మద్దతు కూడగడుతున్న సంఘాలు - tsrtc strike today
ఆర్టీసీ ఐకాస తలపెట్టిన సమ్మె నేటితో ఐదో రోజుకు చేరుకుంది. నేడు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.
ఐదవ రోజుకు చేరుకున్న సమ్మె... మద్దతు కూడగడుతున్న సంఘాలు
Last Updated : Oct 9, 2019, 7:48 AM IST